రావులపాలెం: ఆలయ నిర్మాణానికి వంటిపల్లి రూ.3.5లక్షల విరాళం
రావులపాలెం మండలం ఈతకోట పెద్ద చెరువు వద్ద నూతనంగా నిర్మిస్తున్న వెంకన్న బాబు ఆలయానికి ప్రముఖ పారిశ్రామికవేత్త వంటిపల్లి పాపారావు రూ. 3,50,000 రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయనను అభినందిస్తూ ఆలయ కమిటి సభ్యులు దుశ్శాలువ పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో యర్రం శెట్టి నాగేశ్వరావు (బుజ్జి ), బోడపాటి రాంబాబు , మిరియాల రాము, బోడపాటి వీర్రాజు, యర్రంశెట్టి రాము పాల్గొన్నారు.