తునిలో ఉచిత వైద్య శిబిరం
కాకినాడ జిల్లా తుని పట్టణ రాజా మైదానంలో గురు న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు రోటరీ సెంట్రల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ న్యూరో వైద్యులు గురు ఉచితంగా పరీక్షలు నిర్వహించి ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు. చిన్నపాటి నిర్లక్ష్యాల కారణంగా షుగర్ వంటి వ్యాధులు దరిచేరుతున్నాయని, కాబట్టి జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని డాక్టర్ గురు సూచించారు