మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ ముందు గురువారం లగచర్ల ఘటనను నిరసిస్తూ మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగుల సంఘం ఐకాసా నేతలు రాజీవ్ రెడ్డి, చంద్రనాయక్ లు మాట్లాడుతూ ప్రజాసేవకు విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులపై దాడులు చేస్తే సహించేది లేదన్నారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి అధికారులపై దాడులకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.