రాజమండ్రి: ఉచిత ఇసుక దోపిడీని అరికట్టాలి
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పాలసీతో ప్రజలకు మేలు జరగడంలేదని ఏఐటీయూసీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు తాటిపాక మధు విమర్శించారు. రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట భవన నిర్మాణ కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ఇసుక పాలసీ అధికార పార్టీ నేతలకే అనుకూలంగా మారిందన్నారు.