మాల ఐక్య వేదిక రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడిగా తనను నియమించినట్లు దూళ్ల అంబేద్కర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ మేరకు తనకు నియామక పత్రం అందినట్లు తెలిపారు. తనపై నమ్మకంతో ఈ అవకాశం కల్పించిన జాతీయ అధ్యక్షుడు రవిదేవాకు కృతజ్ఞతలు తెలిపారు.తనకుఇచ్చిన ఈ అవకాశాన్ని బాధ్యతగా స్వీకరించి అంబేద్కర్ ఆశయ సాధనకు మాలల ఐక్యతకు దళితుల హక్కుల కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అంబేద్కర్ కు పదవి రావడంపై టీడీపీ, వైసీపీ, జనసేన, దళిత నాయకులు వెంగళపర్తి గంగాధర్ , కల్తూరి బూరయ్య ,దూళ్ళ వీర్రాజు ,ప్రసాద్, బన్ని,అంజి,లోవ, దుబాసివరప్రసాద్,గగరిన్, దొరై,వీరబాబు,చిన్న,గంగరాజు, అనపర్తి, రాజానగరం,రాజమండ్రి,రాజమండ్రి రూరల్ ,కొవ్వూరు,నరాసపురం అసెంబ్లీ నియొజకవర్గ అధ్యక్షులు హర్షం వ్యక్తం చేశారు.