మద్యం తాగి వాహనం నడుపుతున్న 20 మందిపై కేసు నమోదు చేసినట్లు గండేపల్లి సీఐ వైఆర్ కే. శ్రీనివాస్, ప్రత్తిపాడు సీఐ బి. సూర్య అప్పారావులు సోమవారం మీడియాకు తెలిపారు. గండేపల్లిలో 12 మందిపై, ప్రత్తిపాడులో 8మంది పై కేసులు నమోదయ్యాయి. వీరిని కోర్టులో హాజరుపర్చగా 16 మందికి ఒక్కొక్కరికి రూ. 10వేలు చొప్పున జరిమానా మరో ఇద్దరికి 3రోజులు, ఒకరికి 2 రోజులు, ఒకరికి ఏడు రోజులు జైలు శిక్ష విధించారని తెలిపారు.