ఉండ్రాజవరం పీహెచ్సీలో నవంబర్ 12 నుంచి ఫిబ్రవరి 28 వరకు నిర్వహించనున్న న్యుమోనియా కార్యక్రమంపై మంగళవారం పీహెచ్సీలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉండ్రాజవరం వైద్యాధికారి డాక్టర్ ఆర్ఎస్ఎస్వి ప్రసాద్ మాట్లాడుతూ బాల్యం ప్రశాంతంగా ఊపిరి తీసుకోవాలంటే న్యుమోనియా లక్షణాలను వెంటనే గుర్తించాలన్నారు. తక్షణమే గుర్తించడం ద్వారా 0-5 వయస్సు గల పిల్లలను ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చునన్నారు.