మహాలయ అమావాస్య సంధర్బంగా బుధవారం విజయవాడ ఇంద్రకీలాద్రి పై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట శాసన సభ్యులువేగుళ్ళ జోగేశ్వరరావు బుధవారం దర్శించు కున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగేశ్వరరావుకు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం జోగేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు ఎమ్మెల్యేకు ఆశీర్వచనం చేసి అమ్మవారితీర్ధ ప్రసాదాలు అందజేశారు.