కాకినాడ: 2కె రన్ గోడ పత్రికను ఆవిష్కరించిన కలెక్టర్
భారత దేశంలో ప్రతీ ఏటా 50 వేల మందికి పైగా చిన్నారులు ప్రాణాంతక క్యాన్సర్ బారిన పడుతున్నారని, చాలామందికి క్యాన్సర్ యొక్క తీవ్రత, సరైన అవగాహన లేకపోవడంతో ఎంతోమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్ లో క్యాన్సర్ పై అవగాహన కల్పించే లక్ష్యంతో సహస్ర "చైల్డ్ హెల్త్ 2కెరన్ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు.