జగ్గంపేట పరిసర ప్రాంతంలో శనివారం ఉదయం 9నుంచి సాయంత్ర 4 వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని జగ్గంపేట ఎలక్ట్రికల్ డీఈ వై. డేవిడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జగ్గంపేట 132 కేవీ రామవరం సబ్ స్టేషన్ కు సంబంధించిన 132 కేవీ లైన్ల నిర్మాణ పనుల కొరకు, జగ్గంపేట పెట్రోల్ బంక్ వెనుక ఉన్న ప్రాంతంలో పనులు జరుగుచున్న నేపథ్యంలో రామవరం, మర్రిపాక గ్రామాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని చెప్పారు. ఆయా గ్రామాల విద్యుత్ వినియోగదారులు విద్యుత్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు.