సీజనల్‌గా వచ్చే వ్యాధుల బారిన పడకుండా కాచి చల్లార్చిన నీటినే త్రాగాలని హెల్త్ విజిటర్ పద్మా సూచించారు. గోపాలపురంలో జరుగుతున్న వాక్సినేషన్ కార్యక్రమాన్ని శనివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో ముఖ్యమన్నారు. వ్యాధులు ప్రబలినప్పుడు వైద్యుల సూచన మేరకు మందులు వాడాలన్నారు. ఏఎన్ఎం విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.