పీవీ రావు స్థాపించిన మాల మహానాడు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేయాలని కోనసీమ మాల మహానాడు నాయకులు తెలిపారు. అమలాపురం పట్టణ మాల మహానాడు అధ్వర్యంలో ఈదరపల్లి కమ్యూనిటీ హాల్లో మంగళవారం సమావేశం నిర్వహించారు. వర్గీకరణకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో యువత పాల్గొనకపోతే మాల జాతి ఉనికికే ప్రమాదమని, జాతి క్లిష్ట పరిస్థితులలో ఉందని మరో పోరాటమే చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.