తూర్పుగోదావరి జిల్లాలో పకడ్బందీగా నూతన మద్యం పాలసీని అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి సిహెచ్ లావణ్య తెలిపారు. సోమవారం రాజమండ్రిలో ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 125 మద్యం షాపులను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ షాపులకు లైసెన్సులు జారీ చేసే ప్రక్రియ ఈ నెల 31వ తేదీతో ముగుస్తుందని తెలిపారు.