కొవ్వూరులోని విజయవిహార్ కూడలిలోని అల్పాహార శాలను విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ బృందం సోమవారం తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా గృహాల్లో వాడే 6రు సిలెండర్లను అక్కడ వినియోగించడాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. హోటల్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. ఈ దాడిలో విజిలెన్స్ ఎస్సై జి. మధుబాబు, డీసీ టీఎం ఎం. నవీన్, వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.