అనపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా కార్తీక సోమవార పూజలు వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఆలయాల్లో భక్తులు తెచ్చిన పంచామృతాలతో స్వామి వారికీ ప్రత్యేక అభిషేకాలు చేశారు. అనపర్తి ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో భక్తులు సోమవారం పూజలు చేశారు. తులసి కోట, ధ్వజస్తంభం, మారేడు, జమ్మి, ఉసిరి చెట్ల వద్ద మహిళలు దీపాలు వెలిగించారు.