తిరుపతి జిల్లా నాయుడుపేటలో తిమ్మాజీ కండ్రిగ అమ్మ ఫౌండేషన్ నడుపుతున్న కృష్ణవేణి పేపర్ ప్లేట్ల ఫ్యాక్టరీ బుధవారం అగ్నిప్రమాదానికి గురైంది. అగ్నిమాపక అధికారి శ్యాంబాబు వారి సిబ్బందితో సకాలంలో స్పందించి మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. బాధితురాలు కృష్ణవేణి మాట్లాడుతూ. దాతల సహకారంతో ఫ్యాక్టరీ నడుపుతున్నానని తెలిపింది. సుమారు రూ. 5 లక్షల వరకు నష్టం జరిగిందని వాపోయింది.