బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ ఈనెల 27వ తేదీ పుంగనూరు పట్టణంలో ప్రారంభించిన తిరుమల పరిరక్షణ పాదయాత్ర ఆదివారం సాయంత్రానికి శ్రీనివాస మంగాపురానికి చేరుకున్నట్లు బీసీవై పార్టీ నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో భాగంగా పాదయాత్రలో గోవింద నామస్మరణ చేస్తూ ముందుకు సాగుతున్నట్లు వారు తెలిపారు.