తమకు ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని 108 ఉద్యోగులు పుంగనూరు నియోజకవర్గం సోమల తహశీల్దార్ బెన్నురాజ్ కు గురువారం వినతిపత్రం అందజేశారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే ఈనెల 25వ తేదీ నుంచి ప్రత్యక్ష సమ్మెలోకి దిగుతామని సిబ్బంది శశిధర్, ఈశ్వర తెలిపారు. 108 సర్వీసును ప్రభుత్వమే నిర్వహించాలని వారు వినతి పత్రంలోవినతిపత్రంలో కోరారు. అదేవిధంగా ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని అధికారిని కోరారు.