పుంగనూరు మండల పరిధిలోని మేళం దొడ్డి గ్రామంలో భూ వివాదంలో నర్సింహులు (34) పై అదే గ్రామానికి చెందిన ప్రత్యర్థులు దాడి చేశారు. గాయపడ్డ నరసింహులను స్థానికులు పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా బాధితుడు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సోమవారం మాట్లాడుతూ.. తనపై దాడి చేసిన వారిని చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రత్యర్థులతో తనకు తన కుటుంబానికి ప్రాణభయం ఉందని ఆవేదన చెందాడు.