అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు వారధిగా శాసనసభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ ఉందని నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ బుధవారం అన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని, వైసీపీ ప్రభుత్వ చేతగాని పాలనతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారన్నారు. అప్పుడు అస్తవ్యస్తమైన వ్యవస్థలను గాడిలో పెడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించే బాధ్యతయుతంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు.