పల్లె పండుగ కార్యక్రమంతో నగిరి నియోజకవర్గంలోని గ్రామాలలో ఎంతో అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మాట్లాడుతూ ప్రజలకు కావలసిన అన్ని సౌకర్యాలను ఎన్డీఏ ప్రభుత్వం సమకూరుస్తుందని తెలిపారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తున్నారని తెలియజేశారు.