ఆంధ్రప్రదేశ్ వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ సభ్యులుగా గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండలం టిడిపి ప్రధాన కార్యదర్శి మేల్లపూడి రాజేంద్ర రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు.