రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ సిఆర్ రాజను ఆదివారం ఆయన స్వగృహంలో చిత్తూరు జిల్లా, జీడి నెల్లూరు మండలానికి చెందిన పలువురు టీడీపీ నేతలు గజమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సి. ఆర్ రాజన్ మాట్లాడుతూ అందరికీ అందుబాటులో ఉండి సేవలు అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.