గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్ పురం మండలం పొదలపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం సీఐ హనుమంతప్ప ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించి 2000 లీటర్ల నాటుసార ఊటను ధ్వంసం చేసి 100 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ నాటు సారాను తయారుచేసిన, అమ్మిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు సుమన్, రాజ్ కుమార్, వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.