తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని శుక్రవారం సాయంత్రం హిమాచల్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం ముఖేష్ అగ్నిహోత్రి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ముందుగా ఆలయ ధ్వజస్తంభం మొక్కుకుని, అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.