పాకాల: ఈ రోడ్డుకు మోక్షం కలిగేది ఎప్పుడో.!

69பார்த்தது
పాకాల: ఈ రోడ్డుకు మోక్షం కలిగేది ఎప్పుడో.!
తిరుపతి జిల్లా పాకాల మండలం మొగరాల పంచాయతీ మొగరాలలోని రోడ్డు మొత్తం గుంతలమయమైంది. రెండు రోజులుగా కురుస్తున్న చిన్నపాటి వర్షానికి దామలచెరువు-రమణయ్యగారిపల్లి రోడ్డు మార్గం చెరువును తలపిస్తోంది. దీనివల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు, పాదచారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ రోడ్డు సమస్య నుంచి తమకు విముక్తి కలిగించాలని వేడుకుంటున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி