తిరుపతి జిల్లా దోపిడీ దొంగలు చంద్రగిరి మండలంలో భీభత్సం సృష్టిస్తున్నారు. వరుస చోరీలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రెండు రోజుల కిందట చంద్రగిరి పట్టణంలో ఓ టీచర్ ఇంట్లో రూ. 14 లక్షల విలువైన, 20 సవర్ల బంగారంతో పాటు 200 గ్రాముల వెండి చోరీని మరువక ముందే, బుధవారం ఓ దుకాణంలో చొరబడి నగదును దో చుకెళ్లిన సంఘటన మండలంలోని ఐతేపల్లి సమీపంలోని చోటు చేసుకుంది.