నగరి పట్టణంలో మంగళ, బుధవారం జరగనున్న గంగమ్మ జాతరకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని సీఐ మహేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు నేటి రాత్రికి గ్రామ దేవతలైన " దేశమ్మ , ఓరుగుంటాలమ్మ "ను ఊరేగింపు చేసే క్రమంలో బందోబస్తు కల్పించామన్నారు. మూడు రోజుల పాటు ప్రకాశం రోడ్డులో వాహనాల రాకపోకలు నిషేధించామన్నారు. వాహనాలు బైపాస్ రోడ్డులో వెళ్లి నాగలాపురం రోడ్డు మీదుగా బస్టాండ్ కు వెళ్లాలన్నారు.