గంగాధర నెల్లూరు:మాజీ మంత్రితో సమావేశమైన వెదురు కుప్పం మండల నాయకులు
మాజీ మంత్రి పెద్దిరెడ్డి తో మంగళవారం చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం, వెదురుకుప్పం మండల నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు తిరుపతిలోని ఆయన కార్యాలయంలో మంత్రిని కలసి నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితుల గురించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి వివరించారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంగా పార్టీ కోసం పని చేయాలని మంత్రి పెద్దిరెడ్డి వారికి తెలిపారు.