ఏపీలో మద్యం షాపులు దక్కించుకున్న వారికి కొత్త కష్టం మొదలైంది. మద్యం వ్యాపారంలో ఆశించినంతగా ఆదాయం రావడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త మద్యం పాలసీలో మద్యం వ్యాపారంపై 20 శాతం మార్జిన్ చెల్లిస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ.. తమకు 10 శాతం మాత్రమే గిట్టుబాటు అవుతోందంటున్నారు. దాంతో తాము నష్టాల్లో వెళ్లిపోయి లైసెన్సు రుసుములు చెల్లించలేని పరిస్థితి ఏర్పడే ప్రమాదముందని చెబుతున్నారు.