మాచర్ల: నాగర్జునకొండలో పర్యాటకుల సందడి

84பார்த்தது
ప్రపంచ పర్యాటక కేంద్రమైన మాచర్ల మండలం నాగార్జునకొండను పర్యాటకులు ఆదివారం సందర్శించారు. విజయపురిసౌత్లోని పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లాంచీల ద్వారా నాగార్జునకొండకు చేరుకున్నారు. సాగర్ జలాశయంలో సుమారు గంటపాటు పర్యాటకులు లాంచీలో ప్రయాణిస్తూ ఆహ్లాదకరమైన దృశ్యాలను చూస్తూ కృష్ణమ్మ గలగల సవ్వడులను వింటూ పరవశం పొందారు. కొండలో బుద్ధుని కాలం నాటి పురాతన వస్తువులు, మ్యూజియం, యజ్ఞశాల, అవశేషాలను తిలకించారు.