రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ నెల 26న ఛలో గుంటూరు కలెక్టరేట్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శనివారం ఆంధ్రప్రదేశ్ అంబేడ్కర్ యూత్ అసోసియేషన్ నాయకులు గోళ్ళమూడి రాజాసుందరం బాబు, డేవిడ్ వెల్లడించారు. గుంటూరు అంబేడ్కర్ భవన్ భవన్ లో అసోసియేషన్ సభ్యులు ఛలో కలెక్టరేట్ కార్యక్రమం పోస్టర్లను ఆవిష్కరించారు.