ఉచిత బీమా పథకాన్ని పునరుద్ధరించక పోతే రైతుల ఉసురుకొట్టుకుపోతారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. బుధవారం ఆయన తాడేపల్లి మండలంలోని వైసీపీ కార్యాలయంలో మాట్లాడారు. పరిశ్రమలకు వందల కోట్ల రాయితీలు ఇచ్చి మేలు చేస్తున్నారని, రైతుకు మేలు చేస్తే రాష్ట్రానికి, దేశానికి మంచి చేసినట్టు అన్నారు. రైతేరాజు అని ఈ ప్రభుత్వం గుర్తించాలని చెప్పారు.