గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎప్పటి నుండో తిష్టవేసి ఉన్న ప్రజాసమస్యలు తన దృష్టికి వస్తున్నాయని, వీటి పరిష్కారానికి తప్పక కృషి చేస్తానని ఎమ్మెల్యే గళ్ళా మాధవి హామినిచ్చారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్ శివారు కాలనీలో రోడ్లు సమస్య, డ్రైనేజీ వ్యవస్థ తదితర సమస్యలను ఎమ్మెల్యే గళ్ళా మాధవి దృష్టికి తీసుకువచ్చారు.