ప్రతి శుక్రవారాన్ని డ్రైడేగా పాటించడం వలన వ్యాధులు ప్రబలకుండా చూడవచ్చని పల్నాడు జిల్లా డీఎంఅండెచ్ ఓ రవి అన్నారు. నాదెండ్ల మండలంలోని చందవరం, గణపవరం గ్రామాలలో శుక్రవారం ఆయన జిల్లా మలేరియా అదికారి రవీంద్ర రత్నాకర్ తో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా మురుగు కాలువల్లోని సిల్టు ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. కాలువలలో దోమల లార్వా ఉన్నట్లు గుర్తించిన ఆయన బ్లీచింగు, ఫాగింగు చేయాలని ఆయా పంచాయతీల సిబ్బందికి సూచించారు.