ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో బూత్ కన్వీనర్

81பார்த்தது
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో బూత్ కన్వీనర్
పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు.. కలికిరి మేజర్ పంచాయతీ పరిధిలోని సత్యాపురంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో బూత్ కన్వీనర్ నాగరాజ, విఆర్వో విశ్వనాథతో కలిసి పాల్గొన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న నేపధ్యంలో ఇంటింటికి వెళ్ళి కరపత్రాలను పంపీణీ చేసారు. గోడ పత్రికలను అంటించారు. సామాజిక పింఛన్ల పెంపు, ఉద్యోగులకు 1 వ తేదీన జీతాలు చెల్లించడం, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, పంచాయతీలకు నిధుల మంజూరు, నిరుద్యోగ యువతకు 16 వేల ఉపాధ్యాయ నియామకాలు, వంటి కార్యక్రమాలు ప్రజలకు వివరించారు.

தொடர்புடைய செய்தி