కడప: వైసిపి నాయకులపై అక్రమ కేసులు: మాజీ డిప్యూటీ సీఎం
రాష్ట్రంలో వైసీపీ నాయకులపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తుందని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఆరోపించారు. చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్ వద్ద ఆయన బుధవారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్నారు. తప్పులు చేయని వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు పెడుతున్నారన్నారు.