చెన్నూరు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో నిరక్షరాస్యులను గుర్తించి వారికి విద్యా బోధన అందించాలని ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు, ఎంఇఓ గంగిరెడ్డిలు అన్నారు. మంగళవారం చెన్నూరు ఎంపీపీ సభా భవనంలో అంగన్వాడీ కార్యకర్తలకు, డ్వాక్రా మహిళలకు ఉల్లాస్ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. 15 - 60 సంవత్సరాల లోపు నిరక్షరాస్యులను గుర్తించి వారికి విద్యాభ్యాసాన్ని అందించాలని కోరారు.