బెళుగుప్ప మండలం జీడిపల్లికి చెందిన నవ్య ఉద్యోగం రాలేదని మనస్తాపం చెంది బుధవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నవ్య డిగ్రీ చదవడంతో పాటు సాఫ్ట్వేర్ కోర్సులు చేసింది. పలు ఇంటర్వ్యూలకు హాజరైంది. కానీ ఉద్యోగం దొరకలేదు. ఇక ఉద్యోగం రాదనే బెంగతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.