రాయదుర్గం: ఉరివేసుకొని వివాహిత ఆత్మహత్య
డి. హిరేహాల్ మండలం పులకుర్తి గ్రామంలో వివాహిత మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్రం రాజాపురం గ్రామానికి చెందిన నాగరత్నను ఏడేళ్ల క్రితం పులుకుర్తి గ్రామానికి చెందిన శివరాంకిచ్చి వివాహం చేశారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో నాగరత్న ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.