ఖరీఫ్ లో దెబ్బతిన్న పంటలకు సంబంధించి ఈనెల 19 వ తేది నుంచి పంట నష్టం గణన సర్వే చేపట్టనున్నట్టు శ్రీసత్య సాయి జిల్లా వ్యవసాయ అధికారి సుబ్బారావు గురువారం తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఈ పంట యాప్ ద్వారా వివరాలు నమోదు చేస్తామన్నారు. పంట నష్టపోయిన మండలాల వివరాలను ప్రభుత్వం వెల్లడించిందని, జిల్లాలో మూడు తీవ్ర, ఏడు పాక్షిక కరవు మండలాలను ప్రభుత్వం ప్రకటించిందన్నారు.