వైసీపీ నాయకుడు వర్రా రవీందర్ రెడ్డి పై ఆదివారం మడకశిర పోలీసులకు ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో రవీంద్రారెడ్డి తన ప్రతిష్ఠకు భంగం కలిగే విధంగా, సమాజంలో నైతికంగా దెబ్బతీసే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని వెంటనే అతనిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెస్ రాజు ఈ మేరకు పోలీసులను కోరారు. ఫిర్యాదును పరిశీలించి వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.