ఎస్సీ, ఎస్టీలలో సామాజిక చైతన్యం తీసుకోని రావడమే లక్ష్యంగా చేసుకొని ముందుకు పోతామని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి పేర్కొన్నారు. బుధవారం యాడికి మండల కేంద్రంలో జేఏసీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం స్థానిక ముఖ్య నాయకులు పాండు శ్రీరాములు, బండి మహేష్, గడ్డం బద్రి, చుట్ట బాబులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.