ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఈనెల 18 న సచివాలయాల వద్ద సీపీఐ ఆధ్వర్యంలో వ్యక్తిగత ఆర్జి సమర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బుధవారం పామిడి పట్టణంలోని వికె ఆదినారాయణ కాలనీలో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆవుల శేఖర్ మాట్లాడుతూ. ప్రభుత్వం పేదలకు ఇచ్చిన హామీ మేరకు పల్లెల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలాలు ఇవ్వాలన్నారు.