ఉపాధి హామీ కింద కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం గుంతకల్లు పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం నుంచి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద డ్వామా పిడి, ఎంపిడిఓలు, ఎపిడిలు, ఎపిఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ కింద మరింత ఎక్కువ మంది కూలీలకు ఉపాధి పనులు కల్పించాలన్నారు.