ముదిగుబ్బ: పట్నం ఎస్ఐగా రాజశేఖర్ బాధ్యతలు స్వీకరణ
ముదిగుబ్బ మండలం పట్నం పోలీస్టేషన్ లో నూతన ఎస్ఐగా రాజశేఖర్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పని చేసిన నరసింహులను తలుపుల మండలానికి ఉన్నత అధికారులు బదిలీ చేశారు. పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయనకు పోలీసు సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రామాల్లో సమస్యలను సిబ్బందితో తెలుసుకున్నారు.