జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి
సింగనమల మండల కేంద్రంలో జ్యూస్ ఫ్యాక్టరీ నెలకొల్పాలని బీజేపీ నియోజకవర్గం కో-కన్వీనర్ కుందూ శ్రీనివాసులరెడ్డి ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీని ఆదివారం కోరారు. నార్పల మండలం చామలూరులో బీజేపీ నాయకులతో కలిసి వినతిపత్రం సమర్పించారు. నియోజకవర్గంలో పండ్ల తోటలు విస్తారంగా సాగులో ఉన్నాయని చెప్పారు. జ్యుస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే ప్రజలకు ఉపయోగంగా ఉంటుందన్నారు.