కళ్యాణదుర్గం: ప్రజలతో ఎస్పీ ముఖాముఖి
కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామాన్ని శుక్రవారం సందర్శించారు జిల్లా ఎస్పీ పి. జగదీష్. గ్రామస్థులకు శాంతి సందేశం ఇచ్చారు. గ్రామంలో సమస్యలు ఉంటే పోలీసులకు తెలపాలని, చట్టపరంగా పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చారు.గ్రామంలో అల్లర్లు, గొడవలు తగ్గించి, పరస్పర సహకారంతో జీవించాలని సూచించారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండి, అనవసరమైన ఫ్రాడ్స్ లో ఇరుక్కుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.