అంతరించిపోతున్న వన్యప్రాణుల్లో ఒకటైన భారతీయ అలుగును ఆదివారం యలమంచిలి పట్టణము లో స్థానిక అటవీ అధికారులు గుర్తించారు. ఈ అరుదైన అలుగు భారీ వర్షాలకు అటవీ ప్రాంతం నుంచి నీటిలో కొట్టుకొచ్చినట్టు యలమంచిలి రేంజ్ అధికారి అనిల్ కుమార్ తెలిపారు. పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో ఓ కుటుంబం అలుగును సంరక్షించగా స్థానికులు అటవీ అధికారులు కు సమాచారం అందించడంతో వారు దానిని తీసుకెళ్ళి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.