17న విశాఖకు నీతి అయోగ్ సీఈవో
ఈనెల 17వ తేదీన నీతి అయోగ్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి బి. ఆర్ సుబ్రహ్మణ్యం విశాఖ వస్తున్నారు. ఆయన ఢిల్లీ నుంచి ఆరోజు రాత్రి 10. 15 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారని జిల్లా అధికారులు మంగళవారం తెలిపారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన నగరానికి వెళ్లి ఓ ప్రముఖ హోటల్ బస్ చేస్తారు. 18వ తేదీన సీఈఓ పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని అదే రోజు రాత్రి 11. 10 గంటలకు తిరిగి ఢిల్లీ వెళ్తారు.